NLR: రామాపురం సమీపంలో అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు కారులో వెళ్తున్న జి.బాలు, ఎన్.శ్రీను ముందున్న గుర్తుతెలియని వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పామూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వార్తలు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు


