హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు రామాయంపేటలో శ్రీ జగన్నాథ రథయాత్ర

MDK: రామాయంపేట పట్టణంలో ఈరోజు జగన్నాథ రథయాత్రను కన్నులపండువగా నిర్వహించనున్నారు. వీహెచ్‌పీ, హరేరామ హరేకృష్ణ టెంపుల్ సౌజన్యంతో మొదటిసారిగా ఈ యాత్రను వైశ్య భవన్ నుంచి ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు సన్నాహాలు పూర్తి కాగా, భక్తజనం అధిక సంఖ్యలో తరలివచ్చి జగన్నాథుని రథయాత్రను జయప్రదం చేయాలని నిర్వాహక కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.