హైదరాబాద్: 28°C
వార్తలు

అడుసు తొక్కితేనే తపాలా సేవలు

BDK: SBI, పోస్టాఫీస్ బ్రాంచికి వెళ్లాలంటే ఖాతాదారులు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది. ATMలో పైసలు తీసుకోవాలంటే ఇక్కడ అడుసు తొక్కాల్సిందే. డ్రైనేజీ అధ్వాన స్థితికి చేరడంతో మురుగు నీరంతా బయటికి పొంగుతోంది. బ్యాంకు ఎదుట అదే పరిస్థితి. మురుగులో నుంచి వెళ్లాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.