WGL: వర్ధన్నపేట పట్టణంలో నకిలీ ఆన్‌లైన్ చెల్లింపు స్క్రీన్‌షాట్ చూపించి ఓ కిరాణా వ్యాపారిని మోసం చేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. రూ.3,650 విలువైన సిగరెట్ పెట్టె కొనుగోలు చేసిన వ్యక్తి చెల్లింపు చేసినట్లు నకిలీ స్క్రీన్‌షాట్ చూపించి వెళ్లిపోయాడు. అనంతరం బ్యాంకు ఖాతా పరిశీలించిన వ్యాపారి సాయికుమార్ డబ్బులు జమ కాలేదని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.
వార్తలు
నకిలీ స్క్రీన్‌షాట్‌తో డిజిటల్ మోసం


