ASF: కాగజ్ నగర్ మున్సిపాలిటీలో విధుల పట్ల నిర్లక్ష్యం, నాన్-లోకల్‌గా ఉండటం కారణంగా ముగ్గురు ఆర్పీలను సస్పెండ్ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. సస్పెండ్ అయిన వారిలో పొన్నం శ్రవంతి, ఎమ్మడి శైలజ, శైలజ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.
వార్తలు
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఆర్పీల సస్పెండ్


