హైదరాబాద్: 28°C
వార్తలు

జర్మనీ యూనివర్సిటీతో కేయూ విద్యా సహకార చర్చలు

HNK:కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ) వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్‌రెడ్డి జర్మనీలోని రూట్రంగెన్ యూనివర్సిటీ ప్రతినిధులతో విద్యా సహకారంపై చర్చలు జరిపారు. విద్యార్థుల మార్పిడి, జాయింట్ డిగ్రీలతో పాటు ఇంజినీరింగ్ విద్యార్థులకు 3+2 విధానంలో కేయూలో బీటెక్, జర్మనీలో మాస్టర్స్ చేసే అవకాశాలపై చర్చించారు. ఈ ప్రతిపాదన అమలైతే పరిశోధనలకు ఊతం లభించే అవకాశం ఉంది.