హైదరాబాద్: 28°C
వార్తలు

16 గంటల్లోనే ఏకంగా 1,100mm వర్షం

గుజరాత్‌లో కుండపోత వర్షం కురిసింది. వల్సాద్ జిల్లా ఉంబెర్‌గావ్ తాలూకాలో 16 గంటల్లో ఏకంగా 1,100 మిల్లీమీటర్ల రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. చాలా తాలూకాల్లో 600mmకు పైగా వర్షం కురిసింది. సూరత్, నవ్‌సారీ, డాంగ్స్, తాపి జిల్లాలకు ఇవాళ కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. వాపి, పరిసర ప్రాంతాల్లో 200కు పైగా కార్లు, వేలాది ఇళ్లు నీటమునిగాయి. స్కూళ్లకు సెలవు ప్రకటించారు.