ATP: కళ్యాణదుర్గం నుంచి హానిమిరెడ్డిపల్లి వరకు రూ.8.24 కోట్లతో చేపట్టే తారు రోడ్డు నిర్మాణానికి MLA అమిలినేని సురేంద్ర బాబు భూమిపూజ చేశారు. నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసి 20 గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ 'తల్లికి వందనం' నిధులు అందించినట్లు పేర్కొన్నారు. అనంతరం నాయకులు ఎమ్మెల్యేను సన్మానించారు.
వార్తలు
20 గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం: ఎమ్మెల్యే


