హైదరాబాద్: 28°C
వార్తలు

సరిహద్దులో విస్తృత వాహన తనిఖీలు

GDWL: అలంపూర్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిఘాను కఠినతరం చేశారు. ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో సరిహద్దు ప్రాంతంలో నిన్న రాత్రి విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజల భద్రత కాపాడటమే తమ ప్రథమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు.