హైదరాబాద్: 28°C
వార్తలు

షరతులతోనే దీక్ష విరమణ: వాంగ్‌చుక్

నిరాహార దీక్ష విరమణపై సోనమ్ వాంగ్‌చుక్ 'X' వేదికగా స్పందించారు. దేశంలో హింసను అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో సుదీర్ఘ చర్చల తర్వాత కొన్ని షరతులతో దీక్ష విరమించానని పేర్కొన్నారు. ఆ వివరాలను త్వరలో వీడియో ద్వారా వెల్లడిస్తానని చెప్పారు. హింసకు తావివ్వొద్దని విజ్ఞప్తి చేశారు.