నీట్ ఎగ్జామ్ విషయంలో న్యాయం అడిగిన విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. అసలు దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యం అంతమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని విమర్శించారు. సరిహద్దుల్లో కాపలా కాసే జవాన్లు విద్యార్థులను కొట్టడానికి రావడం దారుణమన్నారు. మనదేశం అనుసరిస్తున్న విధానం ఏమిటో అర్థంకావట్లేదన్నారు.
వార్తలు
దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా: ప్రియాంక


