PDPL: అంతర్గాం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మహేశ్ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నీమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మహేశ్ మృతి వార్తతో పోలీసు శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణతో మహేష్ సేవలందించారు.
వార్తలు
అనారోగ్యంతో కానిస్టేబుల్ కన్నుమూత


