హైదరాబాద్: 28°C
వార్తలు

ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ఐక్య ఉద్యమం పిలుపు

MLG: వెంకటాపురం నూగూరు మండలం పాత్రపురం గ్రామపంచాయతీలో గురువారం ఆదివాసీ అడ్వకేట్స్ అసోసియేషన్, తుడుం దెబ్బ ఆధ్వర్యంలో యువత అవగాహన సభ నిర్వహించారు. 1/70 చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను ఖండిస్తూ, భూములు, అడవులు, జల వనరుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అక్రమ భూఆక్రమణలపై సమగ్ర సర్వే నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.