హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రమంత్రి ఇంటి వద్ద భద్రత పెంపు

నీట్ పేపర్ లీక్ అంశంపై ఢీల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచారు. ఆందోళన కారులు కేంద్రమంత్రి ఇంటిని ముట్టడించే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.