ప్రకాశం: కొమరోలులో శుక్రవారం జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్, ఆర్డీవోతో పాటు జిల్లా ఉన్నతాధికారులు హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు.
వార్తలు
రేపు ప్రజాసమస్యల పరిష్కార వేదిక


