VSP: వీఎంఆర్డీఏ, నేరెడ్కో సంయుక్త ఆధ్వర్యంలో గురువారం చిల్డ్రన్స్ అరేనాలో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన లభించింది. వీఎంఆర్డీఏ ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్ భరత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వయంగా రక్తదానం చేశారు. శిబిరంలో మొత్తం 365 యూనిట్ల రక్తం సేకరించారు.
వార్తలు
రక్తదాన శిబిరానికి విశేష స్పందన


