హైదరాబాద్: 28°C
వార్తలు

రాచర్ల బొప్పాపూర్‌లో హరితహారం

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో హరితహారం గురువారం నిర్వహించారు. వేంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ వెంకట్ రెడ్డి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ముత్యాల చంద్రారెడ్డి, చల్ల పద్మారెడ్డి, పాల్గొన్నారు.