హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్తగా పెన్షన్లు మంజూరు

HYD: తెలంగాణలో కొత్తగా 1.30 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం జాబితా సిద్ధం చేస్తోంది. పెన్షన్ల కోసం వచ్చిన 11 లక్షల దరఖాస్తుల్లో ప్రాధాన్యత క్రమంలో దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పేద వృద్ధుల వివరాలను పరిశీలించినట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన సర్వేలో అనర్హులను గుర్తించడంతో కొత్త లబ్ధిదారులకు పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.