హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులపై పోలీసుల దాడులకు నిరసన

VKB: ఢిల్లీలో NEET పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై పోలీసుల దాడులను నిరసిస్తూ శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా చేపడుతున్న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. PDSU జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాస్, NSUI తాండూరు నియోజకవర్గ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ విద్యార్థులు, విద్యాసంస్థలు బంద్‌కు సహకరించాలని కోరారు.