హైదరాబాద్: 28°C
వార్తలు

బహదూర్‌పల్లిలో కమిషనర్ పర్యటన

HYD: సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గుమ్మళ్ల సృజన బహదూర్‌పల్లి వార్డులో 'వన్ వార్డ్ ఎవ్రీ డే' కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు, ఆర్‌డబ్ల్యూఏలతో మాట్లాడి పారిశుధ్యం, తాగునీరు, మురుగునీటి పారుదల, రోడ్లు, వీధి దీపాల సమస్యలను సమీక్షించారు. వ్యర్థాల సేకరణను బలోపేతం చేసి, గుర్తించిన సమస్యలను నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.