ASR: జీవో నెం.3 చట్టబద్ధత, 1/70 చట్ట పరిరక్షణ కోసం సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలుపై ప్రభుత్వం నిర్దిష్ట హామీ ఇవ్వలేదని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర ఆరోపించారు. గురువారం అరకులో గిరిజన సంఘం నేతలతో కలిసి మాట్లాడారు. జూలై 24న సీఎం రంపచోడవరం పర్యటనలో ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
వార్తలు
'స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఉద్యమం'


