హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతి ఓటు నమోదు చేయాలి: ఎమ్మెల్యే

RR: ఉప్పల్ నియోజకవర్గంలోని మీర్‌పేట్ హెచ్‌బీ కాలనీ తిరుమలనగర్‌లోని ఎస్‌ఐఆర్‌ నమోదు కేంద్రాన్ని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని పేర్కొన్నారు. మాజీ కార్పొరేటర్ ప్రభుదాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.