హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ తీరును ప్రశ్నించిన మల్లన్న

RR: కాంగ్రెస్‌లో రెడ్లను కాపాడుకోవడానికే ఉన్నారా అని తీన్మార్ మల్లన్న మహేశ్ కుమార్ గౌడ్‌ను ప్రశ్నించారు. BCల లెక్కలపై నిరసన తెలిపినందుకు తనపై సస్పెన్షన్ వేటు వేశారని ఆరోపించారు. BC మహిళ ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూత్ ప్రెసిడెంట్ శివచరణ్ రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. క్రమశిక్షణ కమిటీ పనితీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.