NZB: నగరంలోని మురుగు కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో వర్షపు నీరు సక్రమంగా వెళ్లక రోడ్లు జలమయమవుతున్నాయని అధికారులు తెలిపారు. ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థాలను నాలాల్లో వేయడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందన్నారు. ఇంటింటికీ వచ్చే స్వచ్ఛ ఆటోలకు మాత్రమే చెత్తను అందించాలని, నాలాలు, రోడ్లపై వ్యర్థాలు వేయకుండా నగర పరిశుభ్రతకు సహకరించాలన్నారు.
వార్తలు
' కాలువల్లో ప్లాస్టిక్ వేయకండి'


