హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీసులపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరికి గాయాలు

కృష్ణా: కేసరపల్లిలో బుధవారం రాత్రి విధులు నిర్వహిస్తున్న ఉయ్యూరు రూరల్ హోం గార్డ్‌లు శ్రీనివాస్, రాంబాబు పైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడగా, వారిని 108 అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.