SRD: కంగ్టి మండల కేంద్రంలోని హనుమాన్ మందిరం రోడ్డు చిత్తడైంది. గతంలో ఇక్కడ వేసిన సీసీ రోడ్డు పూర్తిగా శిధిలమైంది. చినుకు వర్షం పడితే చాలు రోడ్డంతా ఇలా చిత్తడవుతుంది. గుంతల్లో వర్షపు నీరు నిలుస్తాయి. ప్రధాన వీధి ఈ రోడ్డులో నడిచి వెళ్లాలంటే బురదలో నరకంగా ఉందని స్థానికులు తెలిపారు. కొత్తగా సిసి రోడ్డు నిర్మించి సమస్య తొలగించాలని కోరుతున్నారు.
వార్తలు
చిత్తడైన రోడ్డులో నడిచేది ఎట్లా...?


