హైదరాబాద్: 28°C
వార్తలు

SIR ప్రక్రియను పరిశీలించిన తహసీల్దార్

BDK: మణుగూరు రాజీవ్ గాంధీ నగర్‌లో చేపడుతున్న SIR ప్రక్రియను ఇవాళ తహసీల్దార్ అద్దంకి నరేష్ పరిశీలించారు. ఈ ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా సక్రమంగా ప్రతి పౌరుడు వివరాలు నమోదు చేయాలని ఆయన BLO లకు సూచించారు. ప్రతి ఒక్కరి ఓటు హక్కు ఎంతో అమూల్యమైనదని వెల్లడించారు. వారితోపాటు ఎంపీడీవో శ్రీకాంత్, ఎంపీఓ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.