హైదరాబాద్: 28°C
వార్తలు

'డ్రగ్స్‌ రహిత సమాజానికి యువత ముందుండాలి'

హనుమకొండలో నిర్వహించిన ‘సే నో టు డ్రగ్స్’ అవగాహన ర్యాలీలో TGNPDCL CMD వరుణ్‌రెడ్డి పాల్గొన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణమవుతుందని అన్నారు. డ్రగ్స్‌ అలవాటు వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబాలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.