AKP: నర్సీపట్నంలో దస్తావేజు లేఖరులు చేస్తున్న ఆందోళన గురువారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా పొట్ట కొట్టకండి.. మా బతుకు పాడు చేయకండి అంటూ దస్తావేజు లేఖరులు నినాదాలు చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల నిర్ణయం వెనక్కి తీసుకోవాలన్నారు.
వార్తలు
నర్సీపట్నంలో కొనసాగుతున్న నిరసనలు


