హైదరాబాద్: 28°C
వార్తలు

నెలలు గడుస్తున్నా పూడ్చని గుంత.. ప్రమాదాలకు అవకాశం

ASF: కాగజ్ నగర్ పరిధి అశోక్ కాలనీలో కరెంటు పోల్ కోసం తవ్విన గుంత, 3 నెలలు గడుస్తున్నా పూడ్చలేదు. కరెంటు స్తంభం ఏర్పాటు చేయకపోవడంతో అలాగే ఉందని, పిల్లలు, వాహనదారులు అందులో పడి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.