హైదరాబాద్: 28°C
వార్తలు

రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ లేదన్న సబ్ రిజిస్ట్రార్

అన్నమయ్య: మదనపల్లిలో రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ జరుగుతోందన్న వార్తలు నిరాధారమని సబ్ రిజిస్ట్రార్ ఎం. గురుస్వామి స్పష్టం చేశారు. జి.ఓ.ఎం.ఎస్. 396తో శాఖను ప్రైవేటీకరించడం లేదని, సేవలు మెరుగుపర్చేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని అధికారాలు సబ్ రిజిస్ట్రార్ పరిధిలోనే కొనసాగుతాయని, ప్రజలు అపోహలు నమ్మవద్దని సూచించారు.