హైదరాబాద్: 28°C
వార్తలు

అరటి ఎగుమతులకు నిధులు మంజూరు

ATP: జిల్లా నుంచి ఈ ఏడాది అరటిపంట ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.03 కోట్లు మంజూరు చేసినట్లు ఆ శాఖ డీడీ ఉమాదేవి పేర్కొన్నారు. ప్రధానంగా తాడిపత్రి నుంచి ముంబైకి రైల్వే ఏసీ కంటైనర్ల ద్వారా రవాణాకు చర్యలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది అరటి పంట గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుందన్నారు.