హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్టీ కాలనీలో తాగునీటి కొరత

KDP: సిద్ధవటం మండలం వెంకటాయపల్లె ఎస్టీ కాలనీలో తీవ్ర తాగునీటి కొరత నెలకొంది. తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.