హైదరాబాద్: 28°C
వార్తలు

ద్వారకా తిరుమల ఆలయానికి రూ. లక్ష విరాళం

ELR: ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి వారి శాశ్వత నిత్యా అన్నదాన పథకానికి గుడివాడ మండలం శేరివేల్పూరుకు చెందిన మోటూరి ఉమాదేవి రూ.1,00,008 విరాళం సమర్పించారు. గురువారం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆమె.. ఈ విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. దాతకు అధికారులు ధన్య వాదాలు తెలియజేస్తూ, విరాళం బాండ్‌తో పాటు, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.