హైదరాబాద్: 28°C
వార్తలు

కంబగిరి స్వామి ఆలయంలో బహిరంగ వేలం పాట

NDL: అవుకు మండలం కంబగిరి స్వామి ఆలయంలో బుధవారం ఆలయ ఈవో రామకృష్ణ ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాటను నిర్వహించారు. ఆలయంలో తలనీలాలు, కొబ్బరికాయల షాపులు, ఇంకా తదితర వాటికి వేలంపాట నిర్వహించినట్లు ఈవో తెలిపారు. ఈ వేలంపాటలో ఈ సంవత్సరం అదనంగా రూ. 22 లక్షల 30 వేల రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈవో రామకృష్ణ పేర్కొన్నారు.