హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు

కడపలో సెల్‌ఫోన్ వినియోగంపై తల్లిదండ్రులు మందలించడంతో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తాలూకా సీఐ రాజేంద్రనాథ్ పర్యవేక్షణలో పోలీసులు సెల్‌ఫోన్, సోషల్ మీడియా ఆధారాలను విశ్లేషించి వారు హైదరాబాద్‌కు వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం చార్మినార్ ప్రాంతంలో వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.