హైదరాబాద్: 28°C
వార్తలు

కడెం ప్రాజెక్టులో పెరుగుతున్న నీటిమట్టం

MNCL: భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, ఇవాళ ఉదయం ప్రాజెక్టులో 680.95 అడుగుల నీటిమట్టం ఉంది. గత సంవత్సరం ఇదే సమయానికి ప్రాజెక్టులో 694 అడుగుల నీటిమట్టం ఉండేదని అధికారులు తెలిపారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 698 క్యూసెక్కుల నీరు వస్తుండగా, దిగువకు 65 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.