హైదరాబాద్: 28°C
వార్తలు

ఆదమరిస్తే ప్రమాదమే

అన్నమయ్య: స్థానిక మహబూబ్‌నగర్ వీధిలోని మురుగునీటి కాలువపై గొయ్యి పడి ప్రమాదక రంగా ఉంది. ఈ మార్గంలో ప్రజలు, విద్యార్థులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఎవరైనా అదమరిచి అటుగా వెళ్తే ఆ గోతిలో పడిపోతారు. అటుగా వెళ్లే ప్రజలు, విద్యార్థులు చూసుకుని నడవాల్సి ఉంది. ప్రమాదం జరగక ముందే పంచాయతీ అధికారులు సదరు గోతిపై మూత వేయాలని పలువురు కోరుతున్నారు.