హైదరాబాద్: 28°C
వార్తలు

మైదాన ప్రాంతాల వైపు ఏనుగులు.. భయంలో రైతులు

మన్యం జిల్లా నుంచి విజయనగరం వైపు అటవీ ఏనుగుల గుంపు కదులుతోంది. మైదాన ప్రాంతాల దిశగా ఏనుగుల గుంపు రావడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. తెర్లాం, బాడంగి మండలాల పరిధిలో ఏనుగుల గుంపు సంచరిస్తుంది. బాడంగి మండలం నల్లోడు చెరువు వైపు నుంచి పినపెంకి వైపు ఏనుగులు వెళ్తున్నాయి. మొక్కజొన్న, వరి పొలాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి.