హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: తిరుమల జంక్షన్‌లో మురుగునీటి సమస్య

హన్మకొండ నగరంలో ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఎన్జీవోస్ కాలనీలోని తిరుమల జంక్షన్ వద్ద మురుగునీరు రహదారిపై నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పాటు దుర్వాసన, దోమల బెడద పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మురుగునీటి పారుదల చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు.