హైదరాబాద్: 28°C
వార్తలు

టూ టౌన్ ఎస్‌ఐగా జె. మోహన్ కుమార్ గౌడ్

కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌ఐగా జె. మోహన్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో కడప రిమ్స్, కడప తాలూకా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.