హైదరాబాద్: 28°C
వార్తలు

'గురుకులాల్లో గుక్కెడు నీరు కూడా కరువే'.!?

NLG: కాంగ్రెస్ పాలనలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీరు కూడా కరువైందని సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్‌ అన్నారు. బుధవారం నిడమనూరు సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో గత పది రోజులుగా విద్యార్థినులు తాగు నీటికోసం ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని ఆయన బుధవారం పాఠశాలను సందర్శించారు.