హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు జిల్లాకు సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ రాక

NGKL: పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలాపూర్ గ్రామంలో అమరుడు బొల్లెద్దుల శ్రీనివాస్ సంస్మరణ సభ నేడు మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.ఎండీ. ఫయాజ్ తెలిపారు. ఈ సభకు సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ, రాష్ట్ర నాయకుడు ఎం. బాల నరసింహ హాజరవుతారన్నారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అధికంగా పాల్గొనాలని కోరారు.