BDK: పాల్వంచ పెద్దమ్మ తల్లిని బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ దంపతులు దర్శించుకున్నారు. ముందుగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. వారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈనెల 25న తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారికి అష్టోత్తర కలశాభిషేకం పూజలు నిర్వహిస్తామని ఆలయ ఈవో విజయ్ కుమార్ తెలిపారు.
వార్తలు
పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న అదనపు కలెక్టర్


