హైదరాబాద్: 28°C
వార్తలు

కమర్షియల్ టాక్స్ జేసీగా సునీత బాధ్యతలు

నెల్లూరు డివిజన్ కమర్షియల్ టాక్స్ జాయింట్ కమిషనర్ (జేసి)గా సునీత బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి ఆర్వో కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌గా సేవలు అందించిన ఆమె ప్రమోషన్‌పై నెల్లూరుకు వచ్చారు. ఇప్పటివరకు నెల్లూరు జేసిగా పనిచేసిన కిరణ్ విజయవాడ ప్రధాన కార్యాలయానికి అడిషనల్ కమిషనర్‌గా ప్రమోషన్ పై బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.