హైదరాబాద్: 28°C
వార్తలు

చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భేటీ అయ్యారు. రెండు దేశాల సంబంధాలు సాధారణ స్థితికి రావాలంటే సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి అని జైశంకర్ స్పష్టం చేశారు. పరస్పర గౌరవం, సున్నితత్వంతోనే దీర్ఘకాలిక బంధం సాధ్యమవుతుందన్నారు. అభిప్రాయ భేదాలు వివాదాలుగా మారకుండా దౌత్యపరంగా పరిష్కరించుకోవడం ఇరు దేశాల బాధ్యతని తెలిపారు.