హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ అంశంపై చర్చకు సిద్ధం: నడ్డా

విద్యార్థుల అంశాన్ని రాజకీయంగా వాడుకోవటం దురదృష్టకరమని కేంద్రమంత్రి జేపీ నడ్డా విమర్శించారు. కొన్ని అంశాలనే టార్గెట్‌గా చేసుకుని ప్రతిపక్ష నేత రాహుల్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నీట్ అంశంపై పార్లమెంటులో చర్చకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. విపక్షాలు చీటికిమాటికి గోల్ పోస్ట్ మారుస్తున్నాయని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్ గురించి తమకు బాధ్యత ఉందన్నారు.