హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక వ్యవస్థ: మోదీ

కీలక కార్యదర్శులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. వికసిత్ భారత్ లక్ష్యాలపై అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. ఈ మేరకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రజల సంక్షేమమే అన్ని సంస్కరణల కేంద్ర బిందువు అని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వికసిత్ భారత్ అమలును వేగవంతం చేయాలని తెలిపారు.