హైదరాబాద్: 28°C
వార్తలు

‘ప్రాజెక్ట్ అక్షర’ బలమైన పునాది

విశాఖలో బుధవారం ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ప్రాజెక్ట్ అక్షర’ ఉచిత ట్యూషన్ కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థుల భవిష్యత్తుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించి విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు.