హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక సూచన

దేశంలోని జిల్లా, దిగువ స్థాయి న్యాయస్థానాల అధికారుల పదవీ విరమణ వయసు పెంపుదలపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. జ్యూడిషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసును ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ఈ అధికారుల వయసును 62 ఏళ్లకు పెంచాలని కోరుతూ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం ఈ సూచన చేసింది.